సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఎన్నో విజయవంతమైన స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్న టీ హబ్(T- Hub) విదేశీ కంపెనీలతోనూ కలిసి పనిచేస్తోందని టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు. ఇటీవల జపాన్ దేశంతో కలిసి పనిచేసేలా బియాండ్ నెక్ట్స్ వెంచర్స్(Beyond Next Ventures) సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారని, వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. దేశంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా ఉన్న టీ హబ్‌తో ఇండో -జపాన్ ఇన్నోవేషన్ కారిడార్‌ను బియాండ్ నెక్ట్స్ వెంచర్స్ ఏర్పాటు చేస్తోందన్నారు.
ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో కలిసి పనిచేయడంతో పాటు లోతైన సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచానికి అందించేందుకు కలిసి పనిచేసేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పింస్తుందన్నారు. ముఖ్యంగా భారతీయ, జపనీస్ స్టార్టప్‌ల మధ్య సహకారాన్ని పొందించడంపై ప్రధానంగా దృష్టి సారించడం, పెట్టుబడి మార్గాలతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ను ఏర్పాటు చేసుకునేలా ఉంటుందని సీఈఓ తెలిపారు.