సాధారణంగా సెల్ఫోన్లలో కాపర్, లిథియం తదితర లోహాలతోపాటు మదర్ బోర్డు, ఐసీ, స్రీన్ లాంటి ఉపకరణాలు ఉంటాయి. అవి వినియోగించగలిగే స్థితిలో ఉంటే నేరగాళ్ల ముఠాలు వాటిని వేరు చేసి తిరిగి విక్రయిస్తారు. పాత ఫోన్లలో డేటాను ఫార్మాట్ చేయకపోతే పర్సనల్ చిత్రాలు, వీడియోలు ఉంటే అవి సైబర్ నేరస్తుల ముఠాలకు అమ్ముతున్నారు.
వీటితోపాటు ఆ ఫోన్లను వీలైతే మరమ్మతు చేసి, సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఒకవేళ పోలీసులు దానిపై విచారిస్తే ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా అమ్మినవాళ్లే నేరస్తులుగా పరిగణించబడతారని హెచ్చరిస్తున్నారు. అందుకే సైబర్ కేటుగాళ్లు తెలివిగా ఇతరుల పేర్లపై ఉన్న సెల్ ఫోన్లను, సిమ్ కార్డులను వినియోగించి నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
Mobile Phones | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): పాత సెల్‌ఫోన్‌ను తెలియని వారికి విక్రయిస్తే చికుల్లో పడే అవకాశాలున్నాయని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత మొబైల్ ఫోన్లను కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వరసగా వెలుగు చూస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. గత ఆగస్టులో బిహార్‌కు చెందిన ఓ ముఠాను రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి ఏకంగా 4,000కు పైగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠాను విచారించడంతో ఎన్నో కీలక విషయాలు వెలుగుచూశాయి.
ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన రాజస్థాన్ ముఠాకు, ఈ పాతఫోన్లు కొని, వారికి విక్రయించే ముఠాలకు సంబంధం ఉన్నట్టు తేలింది. ఈ పాత సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్న ముఠాలు కిలోల లెక్కన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి.. అందులోని సమాచారాన్ని రిట్రీవ్ చేసి, అందులోని కాంటాక్ట్ నంబర్ల చొప్పున సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. గతంలో పట్టుబడిన ఈ ముఠా బిహార్‌లోని కతిహార్ జిల్లా రౌతారా ప్రాంతానికి చెందిన అక్తర్ అలీ సూచనతో పాత సెల్ఫోన్లు కొంటారు. తమ నుంచి కిలోల లెకన అక్తర్ వాటిని కొనుగోలు చేసి, కీలక సమాచారం సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.