ఫిట్కాప్ యాప్తో మెరుగైన ఆరోగ్యం
పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ప్రతి రోజూ వ్యాయామం, నడక ఆరోగ్యాన్ని కాపాడుతుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి సూచించారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(హెచ్హెచ్ఎఫ్) సహకారంతో నగర పోలీస్ కమిషనరేట్లో పని చేస్తున్న 16 వేల మంది సిబ్బందికి హెల్త్ స్క్రీనింగ్ చేసి ఫిట్కాప్ యాప్ సహకారంతో మెరుగైన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వివరిస్తున్నది.
- హెచ్హెచ్ఎఫ్ సహకారంతో సిబ్బందికి సూచనలు
- హైరిస్క్ నుంచి 60 మంది సిబ్బంది రిలీఫ్
- ఆరోగ్య సంస్కృతిని ప్రతిబించాలి
- నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ప్రతి రోజూ వ్యాయామం, నడక ఆరోగ్యాన్ని కాపాడుతుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి సూచించారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(హెచ్హెచ్ఎఫ్) సహకారంతో నగర పోలీస్ కమిషనరేట్లో పని చేస్తున్న 16 వేల మంది సిబ్బందికి హెల్త్ స్క్రీనింగ్ చేసి ఫిట్కాప్ యాప్ సహకారంతో మెరుగైన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వివరిస్తున్నది. ఈ క్రమంలోనే హైరిస్క్ ఉన్న 60 మంది సిబ్బంది తమ ఆరోగ్యాన్ని ఫిట్ కాప్ యాప్ ద్వారా మెరుగుపరుచుకున్నారు. వీరికి పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ రివార్డులు అందజేశారు.
చార్మినార్ పీఎస్లో పని చేస్తున్న ఒక కానిస్టేబుల్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఉద్యోగం మానేసే పరిస్థితి ఉండేది. ఫిట్కాప్ యాప్ ద్వారా తన ఆరోగ్యాన్ని ఆయన మెరుగుపరుచుకొని తిరిగి ఉద్యోగంలో ఉత్సాహంగా పని చేసే స్థాయికి వచ్చాడు. ఒక మహిళా కానిస్టేబుల్ తన కూతురు ప్రాణాలను కాపాడుకుంది. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలర్తో ఫోన్లో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం కోసం ఫిట్కాప్ యాప్ ద్వారా కౌన్సిలర్లు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు చేశారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం, బరువు తగ్గించడం కోసం చేసే వ్యాయామాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. తమ కుటుంబంలో ఆరోగ్య సంస్కృతిని ప్రతిబింబించాలని సీపీ సిబ్బందికి సూచనలు చేశారు. మెరుగైన ఆరోగ్య పరిస్థితికి శరీరంలోని కేలరీలను కరిగించాలని అవసరమైనప్పుడు నడవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఆరు నెలల్లో సిబ్బంది ఆరోగ్య అలవాటు మార్చడం, వారి ఆరోగ్యం విషయంలో పురోగతి ఉండడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిస్క్ కేటగిరీలో ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న అభ్యర్థులను టీ షర్టులు, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ గజరావు భూపాల్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇన్చార్జి, డీసీపీ సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- CV Anand
- FitCop app
- HHF
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

