సికింద్రాబాద్,డిసెంబర్12: సికింద్రాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన తీగుళ్ల పద్మారావుగౌడ్‌ను సోమవారం రాత్రి పలువురు నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మారావు మొదటి సారి వచ్చారని తెలుసుకున్న నాయకులు ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఎమ్మెల్యే పద్మారావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలగూడ డివిజన్ ఏసీపీ జైపాల్‌రెడ్డి, వారాసిగూడ, చిలకలగూడ, లాలాగూడ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్ శంకర్,సిరికొండ మట్టంరాజు,మధులతలతో పాటు సీతాఫల్మండి కార్పొరేటర్ హేమ, నాయకులు చంద్రశేఖర్,కరాటే రాజు మల్లూరి అనిల్ ,మహిళా నేతలు కలిశారు.
ఎమ్మెల్యే పద్మారావు హ్యాట్రిక్ విజయం..
అడ్డగుట్ట, డిసెంబర్ 12 : సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందిన పద్మారావు గౌడ్‌ను ఎమ్సీఆర్ ప్రజాసేవ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మ్యాకల చంద్రశేఖర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ హ్యాట్రిక్ విజయంతో కొత్త చరిత్ర సృష్టించారని తెలిపారు.