ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 9 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ ప్రాక్టికల్ పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, మొదటి, మూడు, అయిదో సెమిస్టర్ బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని నగేశ్ తెలిపారు.