ఖైరతాబాద్, మే 16: బీసీల లెక్కలు తేల్చి న తర్వాతే.., స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువా రం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నాయకులతో కలిసి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న ట్లు తెలుస్తోందని, కులగణన, రిజర్వేషన్లను పెంచకుండా ఆ నిర్ణయం తీసుకోవద్దన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో సమగ్ర కులగణన చేపడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం.26ను విడుదల చేయడంతో పాటు రూ.150 కోట్లు కేటాయిస్తున్న ట్లు ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రస్తు తం, ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఎన్నికలకు ముందు జారీ చేసిన జీవో నం.26 ప్రకారం, తక్షణమే కులగణన షురూ చేయాలన్నారు. ఆ తర్వాతే గ్రామ పంచాయతీ, మండల, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే బీసీలు ఆర్థికంగా బలంగా లేరన్న సాకుతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని, రిజర్వేషన్లు పెంచకుండానే ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు తీరని నష్టం జరుగుతుందని, న్యాయపరమైన చిక్కులు ఏర్పడి శాశ్వతంగా దానికి బ్రేకులు పడే ప్రమాదం ఉందన్నారు.
ఒకటి, రెండు నెలల్లోనే శాస్త్రీయంగా బీసీల లెక్కలు తీసే అవకాశం ఉంద ని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థ ల ఊసెత్తవద్దన్నారు. త్వరలోనే కులగణన, రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలపై మేధావులు, రిజర్వేషన్ల నిపుణులతో మేధో మథన సమావేశాన్ని ఏర్పాటు చేసి స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తామన్నారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ చిన్న శ్రీశై లం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివా స్ ముదిరాజ్, మహి ళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మణి మంజరి, జన సైన్యం అధ్యక్షులు నగేష్, సత్యం యాదవ్ పాల్గొన్నారు.