చిక్కడపల్లి, మే 14: పేదరికాన్ని చదువు ద్వారానే జయించడం సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఆకాశం నుంచి గంగను భూమి మీదికి తీసుకుచ్చిన మహర్షి అందిరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ సగర సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భగీరథ మహర్షి జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్, హరి కిషన్, మారుతి సాగర్, ఆంజనేయ హాజరయ్యారు. వకుళాభరణం మాట్లాడుతూ, కఠినమైన తపస్సుతో గొప్ప కార్యాన్ని సాధించిన భగిరథుని వారసులుగా సగరులు ఏదైనా సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ అధ్యక్షుడు ఎం.రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌ.అధ్యక్షుడు వెంకటస్వామి, ప్ర.కార్యదర్శి వెంకటరాములు స్వామి, కోశాధికారి రామస్వామి పాల్గొన్నారు.