BC caste | జనగణనలో బీసీ కులగణన చేపట్టాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
జనగణనలో బీసీ కులగణన చేపట్టాల్సిందిగా కేంద్రంపై అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. జనగణనలో బీసీ కులగణన చేస్తామని చెప్పిన కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి బీసీలను విస్మరించిందని ఆరోపించారు.
ముషీరాబాద్, ఆగస్టు 24 : జనగణనలో బీసీ కులగణన చేపట్టాల్సిందిగా కేంద్రంపై అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. జనగణనలో బీసీ కులగణన చేస్తామని చెప్పిన కేంద్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి బీసీలను విస్మరించిందని ఆరోపించారు. సోమవారం ఇందిరాపార్కు వద్ద బీసీల కులగణన జరిగితేనే..బీసీలకు న్యాయం జరుగుతుందనే నినాదంతో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జనగణనలో కులగణన చేపడుతామన్న కేంద్రం బీసీలకు ప్రత్యేక కాలం లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీసీనని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ 80 ఏండ్లుగా బీసీలు అగ్రవర్ణాల పాలనలో మోసపోతున్నారని, జనగణనలో కులగణన చేపడితేనే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్నారు.
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో జంతువులకు, చెట్లకు లెక్కలు ఉన్నా బీసీలకు మాత్రం లెక్కలు లేకపోవడం దారుణమన్నారు. దీక్షలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ డీజీపీ పూర్ణచందర్రావు, తెలంగాణ గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సరిత, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేణుక, గుజ్జ కృష్ణ, బాలగోని బాలరాజ్ గౌడ్, దుర్గయ్య గౌడ్, కోల జనార్దన్, శ్యామ్కురమ, శ్రీకాంత్, లక్ష్మణ్ యాదవ్, అజయ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

