బీసీ బంధు సీఎం కేసీఆర్..
వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం బీసీబంధు అమలు చేస్తూ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అడిక్‌మెట్‌లో లబ్ధిదారులు, బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ముషీరాబాద్, ఆగస్టు 24 : వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం బీసీబంధు అమలు చేస్తూ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అడిక్‌మెట్‌లో లబ్ధిదారులు, బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. అడిక్‌మెట్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు శ్యామ్‌సుందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మాధవ్, సయ్యద్ అస్లాం, సురేందర్, ప్రవీణ్, గురుదీప్‌సింగ్, ప్రకాశ్ దేవ్డా, అబిద్, మాణిక్‌ప్రభు, సత్యనారాయణ, గిరి, నాగులు, జ్ఞాని, అస్లాం, లక్ష్మణ్ పాల్గొన్నారు.
బీసీ కులవృత్తులకు సాయం పై
అంబర్‌పేట, ఆగస్టు 24 : బీసీ కులవృత్తి దారులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేయడం పై హర్షిస్తూ…అంబర్‌పేట నియోజకవర్గం నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీరాములు ముదిరాజ్ నేతృత్వంలో బాగ్‌అంబర్‌పేట డివిజన్ రెడ్‌బిల్డింగ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు జి.వినయ్‌కుమార్, ఎంకే శ్రీను, జై గణేశ్, నగేశ్, ఎస్.రాజు, ఏ.శ్రీనివాస్, ఏ.బాలరాజు, కె.లత, సి.ఉమా, సుష్మలతో పాటు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, అఫ్రోజ్పటేల్, శివకుమార్ గుప్తా, రవీందర్, రమేశ్, కాడిగె శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్, వెంకటేశ్, ప్రవీణ్, రాజు, మెడికల్ శ్రీను పాల్గొన్నారు.
దివ్యాంగుల పింఛన్ పెంపును హర్షిస్తూ..
దివ్యాంగుల పింఛన్‌ను రూ. 3,016 నుంచి రూ. 4,016 కు పెంచి తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పలువురు దివ్యాంగులు పేర్కొన్నారు. పింఛన్ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం కవాడిగూడలోని జీహెచ్ఎంసీ గ్యారేజీలోని పార్కింగ్ యార్డులో స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బండారి యాదగిరి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జగన్, సుధాకర్, జగదీష్, నాజిమ్, దయానంద్, శ్రీనివాస్ గౌడ్, గణేశ్, శ్రీనివాస్, వెంకటేశ్, లింగప్ప, సంతోష్, యాకయ్య, సతీశ్, ఉమా, శ్రీనివాస్, ఎండీ హేస్సేన్, సతీశ్, రవీందర్, సందీప్, గంగారామ్ తదితరులు పాల్గొన్నారు.
నాచారంలో..
రామంతాపూర్, ఆగస్టు 24 : దివ్యాంగుల పింఛన్ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ నాచారం వైజయంతి సినిమా టాకీస్ వద్ద వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బూడిద గణేశ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిట్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, దివ్యాంగులు యాదగిరి, మల్లేశ్, ఉప్పలమ్మ, విద్య, నరేందర్, నాయకులు ముత్యంరెడ్డి, కర్ణ, అంజి, భూపాల్‌రెడ్డి, శివ, కట్టబుచ్చన్న గౌడ్, విఠల్ యాదవ్, అశోక్, రమేశ్, వాసు, సుగుణాకర్‌రావు, కుమార్, హరిప్రసాద్, నర్సింగ్‌రావు, మధుకర్‌రెడ్డి, శివ, దత్తు, శ్రీనివాస్, లడ్డు, శివకుమార్, ఖదీర్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?




