వృద్ధులు, వికలాంగులు, మహిళల కోసం
అలుపు లేకుండా సులువుగా
ఆర్టీసీలో ఇటీవల చేపడుతున్న పలు సంస్కరణల్లో భాగంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఇమ్లిబన్)లో కొత్త సదుపాయాన్ని కల్పించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నారుల సౌకర్యార్థం బస్ స్టేషన్ ప్రవేశం వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుంచి వరంగల్ ప్లాట్‌ఫాం వరకు సులువుగా చేరుకునేందుకు బ్యాటరీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం వాహనాన్ని ప్రారంభించారు.