ప్రగతి పథంలో బస్తీలు
పట్టణ ప్రగతి కార్యక్రమం 14వ రోజు జోరుగా సాగింది. గురువారం 30సర్కిళ్ల పరిధిలోని 270 కాలనీలు, బస్తీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రత్యేక బృందాలు కాలనీ సంక్షేమ సంఘాలను, ప్రజలను భాగస్వామ్యం చేసుకుని ముందుకు సాగారు. కాలనీల్లో ఉన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిషరించేందుకు చర్యలు చేపట్టారు
14 రోజుల్లో.. 5,306 బస్తీల్లో.. పట్టణ ప్రగతి
ప్రజల భాగస్వామ్యంతో జోరుగా సాగుతున్న కార్యక్రమం
ఒక్కరోజే 7,236 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు
1,36,543 ఇండ్లలో యాంటీ లార్వా పిచికారీ
10,328 ఇండ్లకు మొకలు పంపిణీ
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతి కార్యక్రమం 14వ రోజు జోరుగా సాగింది. గురువారం 30సర్కిళ్ల పరిధిలోని 270 కాలనీలు, బస్తీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రత్యేక బృందాలు కాలనీ సంక్షేమ సంఘాలను, ప్రజలను భాగస్వామ్యం చేసుకుని ముందుకు సాగారు. కాలనీల్లో ఉన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిషరించేందుకు చర్యలు చేపట్టారు. పరిశుభ్రత పనులు చేపట్టడంతో పాటు మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, కాలనీల వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పటి వరకు 5,306 బస్తీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తి చేశారు.
ఎంటమాలజీ..
1,36,543 ఇండ్లలో యాంటీ లార్వా చర్యలు చేపట్టారు
1,29,654 ఇండ్లలో ఫాగింగ్ చేపట్టారు
గ్రీనరీ..
4316 మొకలు నాటారు
1416 మీటర్లు రోడ్డు మధ్యలో (మీడియన్ ప్లాంటేషన్) మొకలు నాటారు.
కిలోమీటర్ల రోడ్డు మార్గంలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు.
10,328 ఇండ్లకు మొకలు పంపిణీ చేశారు
కిలోమీటర్ల రోడ్డు మార్గంలో మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు.
4,377 మొకలకు సాసర్ చేసి, కలుపు తీశారు.
పరిసర ప్రాంతాల్లో గ్రీనరీ అభివృద్ధి చేసిన రెండు జంటలకు సన్మానం చేశారు.
14వ రోజు చేపట్టిన కార్యక్రమాలు
- తొలగించిన మొత్తం చెత్త 7,236 మెట్రిక్ టన్నులు
- తొలగించిన భవన నిర్మాణ వ్యర్థాలు 2,190 మెట్రిక్ టన్నులు
- 113 కిలోమీటర్ల మేర రోడ్డు పకన ఉన్న ముళ్ల పొదలు తొలగింపు
- 17 కిలోమీటర్ల డ్రైనేజీ/నాలాల్లో పూడిక తొలగింపు
- 3 శిథిల భవనాల వ్యర్థాలు తొలగింపు
- 2 చోట్ల లోతట్టు ప్రాంతాలను పూడ్చివేశారు.
- 3085 ప్రాంతాల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్
- 59 మంచినీటి ట్యాంక్లు, పరిసరాలను శుభ్రం చేశారు
- 49 పారుల ఆవరణలను శుభ్రం చేశారు
- 64 కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ భవన సముదాయాలు పరిశుభ్రం చేశారు
- 1082 మరుగుదొడ్లను శుభ్రం చేశారు
- 31 వైకుంఠధామాలు/శ్మశానవాటికల్లో ఉన్న వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

