Basti bata | ప్రజా సమస్యల పరిష్కారానికే బస్తీ బాట : ఎమ్మెల్యే ముఠా గోపాల్
ప్రజల సమస్యలు తెలసుకోవడానికి చేపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
చిక్కడపల్లి : ప్రజల సమస్యలు తెలసుకోవడానికి చేపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శనివారం రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లి లోని అచ్చయ్య నగర్ బస్తీ, ఈడబ్ల్యుఎస్ క్వార్టర్స్, బృందావన్ కాలనీ తదితర కాలనీల్లో ఎమ్మెల్యే బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీలల్లో పర్యటించి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చయ్యనగర్‌లో డ్రైనేజీ సమస్య, పోలీస్ పేట్రోలింగ్ ఏర్పాటు చేయాలని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.
అవసరం ఉన్న చోట నూతన మంచినీటి పైప్లైన్లు, డ్రైనేజీ పైప్లైన్లు నిర్మాణం చేపడుతామని అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, బాగ్‌లింగంపల్లి వాటర్‌వర్క్ మేనేజర్ జీవన జ్యోతి, ఏఈ మురళీ, డివిజన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రావులపాటి మోజస్,మన్నె దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

