సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఫిల్మ్‌నగర్-దర్గా దారిలో రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా చెత్త వేయడంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నది. అటువైపు నుంచి వెళ్లే వాహనదారులతో పాటు చుట్టుపక్కల ప్రజలు వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిపై ‘నమస్తే’ ‘ముక్కుపుటాలదిరేలా’ శీర్షికతో మార్చి 8న ఫొటో వార్త ప్రచురితమైంది. స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ ప్రాంతంలో గోడ నిర్మించి, దానిపై సీసా పెంకులు ఏర్పాటు చేశారు. అక్కడ చెత్త వేస్తే రూ.పది వేలు జరిమానా విధిస్తామని బోర్డు పెట్టారు.