సిటీబ్యూరో, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): 75 ఏండ్ల స్వతంత్య్ర భారత్‌లో ‘సమగ్రత స్వావలంబన’ అనే నేపథ్యంతో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా నేతృత్వంలో ఆదివారం జోనల్ కార్యాలయ సిబ్బంది వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించడమే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఉద్దేశమని పేర్కొన్నారు. వాకథాన్ సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా బీవోబీ సిబ్బంది ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో బీవోబీ హైదరాబాద్ డిప్యూటీ జోనల్ ఆఫీసర్ కె.వినోద్‌బాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్, మెట్రో, దక్షిణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల అధికారి వై.శ్రీనివాసులు, హైదరాబాద్ విజిలెన్స్ విభాగం జోనల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.