బంజారాహిల్స్, ఏప్రిల్ 9: పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించేలా డీజే ద్వారా మ్యూజిక్ ప్లే చేస్తున్న పబ్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని హయత్ ప్లేస్ హోటల్ టెర్రస్ మీద నడుస్తున్న జింగ్ స్కై బార్ అండ్ లాంజ్ పేరుతో నడుస్తున్న పబ్లో అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేయడంతో పాటు భారీగా మ్యూజిక్ ప్లే చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించారు.
అక్కడ ఏర్పాటు చేసిన డీజే మిక్సర్, లైవ్ మిక్సర్తో పాటు స్పీకర్లు ఇతర సామగ్రిని సీజ్ చేసిన పోలీసులు.. పబ్ మేనేజర్ రోబిన్ సహాయ్, సెక్యూరిటీ మేనేజర్ రామానుజులు, డీజే అపరేటర్ నరేన్ కుమార్ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.