బంజారాహిల్స్, సెప్టెంబర్ 1: టీవీ9 చానల్ కార్యాలయం మీద రాళ్లు విసిరిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌లోని టీవీ9 చానల్ కార్యాలయానికి గత నెల 30న మధ్యాహ్నం సర్దార్ అనే వ్యక్తి వచ్చాడు.
కార్యాలయం ఆవరణలోకి ప్రవేశించిన సర్దార్ తనతో పాటు తెచ్చుకున్న రాళ్లను విసిరాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు ప్రకాశ్, ప్రసాద్ అతడిని అడ్డుకునేందుకు యత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. రాళ్లదాడిలో కార్యాలయం అద్దాలు ద్వంసమయ్యాయి. టీవీ9 అడ్మిన్ రాము ఫిర్యాదు మేరకు 448, 427, 506. 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.