Balkampeta Yellamma | అమీర్‌పేట్, ఆగస్టు 19 : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ కల్యాణ మండపం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పర్యాటక సంస్థ ప్రవేశపెట్టిన ‘ప్రసాదం’ పథకంలో భాగంగా గతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కేంద్రం శ్రీకారం చుట్టింది.
అయితే ఈ పథకం కింద బల్కంపేట దేవాలయానికి కూడా రూ. 4.21 కోట్ల నిధులు మంజూ కావడంతో.. దేవాదాయ అధికారులు ఇక్కడి దేవాలయం వెనుక శిధిలావస్థకు చేరిన బాబూలాల్ అగర్వాల్ కల్యాణ మండపం స్థానంలో నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని గతంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే నిర్ణయాలు జరిగినా, ఆచరణలో మాత్రం ఈ భవనం కూల్చివేతలు ఇంచు కూడా ముందుకు సాగలేదు.
ఎల్లమ దేవాలయానికి పెరుగుతున్న భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని, ప్రసాదం పథకం ద్వారా చక్కటి భవన నిర్మాణం జరిగేలా పురాతన భవనాన్ని కూల్చివేసే పనులు చేపడుతున్నట్టు దేవాలయ ఈవో మహేందర్‌గౌడ్ తెలిపారు. వివిధ కారణాలతో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉంటూ వచ్చిన కూల్చివేత పనులను వెంటనే చేపడుతున్నట్టు తెలిపారు.