ఉత్సవాలకు నేడు అంకురార్పణ
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని
కోర్కెలు తీర్చే అమ్మ.. ఎల్లమ్మ తల్లి
నేటి నుంచి అమ్మవారి కల్యాణోత్సవాలు
అమీర్పేట్, జూలై 3: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ వారి కల్యాణ ఉత్సావాలు నేటి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పకడ్బందీగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కల్యాణ వేడుకలు ఉదయం గణపతి పూజతో ప్రారంభమై బుధవారం సాయంత్రం పురవీధుల్లో జరిగే రథోత్సవంతో ముగుస్తుంది. ఐదో తేదీ మంగళవారం ఉదయం 11.45 గంటలకు అమ్మవారి కల్యాణోత్స వం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చే అశేష జన వాహినికి ఎక్కడా అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బల్కంపేట వాసుల సేవలు వెలకట్టలేనివి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
భక్తుల ఆకలి తీర్చేందుకు 100కు పైగా శిబిరాలు
ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు తరలివచ్చే భక్తుల ఆకలిని తీర్చడంలో బల్కంపేట వాసులు చూపే ఔదార్యం వెలకట్టలేనిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అమ్మవా రి కల్యాణోత్సవానికి వస్తున్న భక్తులు తమ ఇంటికే వస్తున్నట్టు భావిస్తూ వారి ఆకలిని తీర్చేలా బల్కంపేట వాసులు తమ శక్తి కొలది ఉచిత అన్నదాన కేం ద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేవాలయ చుట్టు పక్కల చిన్నా పెద్దా కలిపి దాదాపు 100కు పైగా ఉచిత అన్న ప్రసాద శిబిరాలు వెలుస్తుండటం చెప్పుకోదగిన విషయమన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆకలితో వెళ్లకుండా ఎక్కడివారు అక్కడ భోజనాలు చేసేలా శిబిరాలు వెలియడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. చాలా ఏండ్లుగా కూతురు భూమయ్య మల్లయ్య వంశవృ క్షం వేదికగా సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కూతు రు నర్సింహ అమీర్పేట్ పాత ఎక్సైజ్ స్టేషన్ ఎదుట ఉదయం 7 నుంచి 11 గంటల వరకు భక్తులకు అ ల్ఫాహారం, మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ శిబిరంలో వేలాది మంది భక్తుల ఆకలి తీర్చడం ఎంతో పుణ్య కార్యమన్నారు. ఈ మేరకు కూతురు భూమయ్య మల్లయ్య వంశవృక్షం నిర్వాహకులు కూతురు నర్సింహ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే తమ శిబిరాన్ని సందర్శించాలని ఆహ్వాన పత్రాన్ని ఎన్.శేషు కుమా రి, నాయకులు సంతోష్ మణి కుమార్, కట్టా బలరామ్లతో కలిసి అందజేశారు.