బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ట్రాఫిక్ ఆంక్షలు
బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళింపు అమలులో ఉంటుందని నగర పోలీసు ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళింపు అమలులో ఉంటుందని నగర పోలీసు ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ ఉత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశమున్నందున బల్కంపేట పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయ్యే సూచనలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ మళ్లింపు చేపట్టామని తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఫతేనగర్ ఫ్లైఓవర్, ఫతేనగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ వద్ద ఎస్ఆర్నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి సనత్‌నగర్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట ఆలయం వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించకుండా ఈ వాహనాలను హైదరాబాద్ కిచెన్ మార్ట్ న్యూ బ్రిడ్జి వద్ద ఆర్యూబీ ద్వారా కట్టమైసమ్మ దేవాలయం బేగంపేట వైపు మళ్లిస్తారు. గ్రీన్‌ల్యాండ్స్ నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించకుండా ఫుడ్‌వరల్డ్ ఎక్స్ రోడ్స్ వద్ద సోనాబాయి టెంపుల్ గుండా ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. బేగంపేట, కట్టమైసమ్మ ఆలయం వైపు నుంచి బల్కంపేట ఆలయానికి వచ్చే ట్రాఫిక్‌ను బేగంపేట ఫ్లైఓవర గుండా గ్రీన్‌ల్యాండ్స్ వైపు మళ్లిస్తామని పోలీసులు తెలిపారు.
ఎస్ఆర్ నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న ఉపసందులు, లింక్ రోడ్లు అన్నీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు తమ వాహనాలను ఆర్అండ్బీ ఆఫీస్, జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, పద్మశ్రీ అపార్ట్మెంట్స్, డీకేరోడ్ నుంచి నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్డువైపు పార్కింగ్, ఫతేనగర్ అండర్‌బ్రిడ్జి, నేచర్ క్యూర్ హాస్పిటల్, సనత్‌నగర్‌లోని జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని తెలిపారు. మరోవైపు బల్కంపేట ఎల్లమ్మ బోనాలకు మంగళ, బుధవారాల్లో వచ్చే భ క్తుల కోసం జంటనగరాల్లోని పలు ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసు శాఖ సూ చనలతో బస్సులు నడుపుతామని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

