GHMC | సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్టు విభాగం అక్రమాలకు నిలయంగా మారింది. సమర్థులైన ఐఏఎస్ ఆఫీసర్లు జీహెచ్ఎంసీకి బాస్లుకా వస్తున్నా, ట్రాన్స్ పోర్టు వింగ్‌ను గాడిన పెట్టలేపోతున్నారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కమిషనర్ మొదలుకుని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వరకు వివిధ హోదాల్లోని ఆఫీసర్ల వినియోగించుకే వాహనాలు, పాలక మండలి పెద్దల వాహనాలు, ఎసార్ట్ వాహనాలతో పాటు కాలం చెల్లిన వాహనాల రిపేర్లతో పాటు ఇంధన కూపన్ల వరకు ఒక్కో రీతిలో జరుగుతున్న దందాకు అడ్డుకట్ట పడడం లేదు.
అద్దె వాహనాలు వ్యవహారాలను చూసుకునే ట్రాన్స్ పోర్టు విభాగంలో ఇప్పటి వరకు బోగస్ ఇండెంట్లతో పాటు స్పేర్ పార్ట్స్ వరకు వరుసగా సామ్‌లు జరిగిన రవాణా విభాగంలో ప్రక్షాళన వైపు అడుగులు పడడం లేదు..ముఖ్యంగా ఈ విభాగంలో పని చేసే నైపుణ్యత లేకపోయినా, ఆఫీసర్లను, పాలక మండలి పెద్దలను మేనేజ్ చేసుకునే సిల్ ఉంటే అక్రమార్జనకు కొదవే లేదన్న వాదనలున్నాయి. ప్రస్తుతం రవాణా విభాగంలో ఫోర్ మెన్లదే హవా కొనసాగుతున్నట్లు చర్చ జరుగుతున్నది.
బల్దియాలో అతి పెద్ద ట్రాన్స్ పోర్టు యార్డు అయిన కవాడిగూడలో కొందరు ఫోర్ మెన్లు నియామకం మొదలు నేటికీ సుమారు మూడు దశాబ్దాలు గడుస్తున్నా, అకడే కొనసాగుతుండడం గమనార్హం. ఫలితంగా ఏండ్లుగా ఇకడ తిష్ట వేసిన ఫోర్ మెన్లు తమ ఇష్టారాజ్యంగా ఇంటెంట్లు రాసుకుని, క్యాష్ చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుత అదనపు కమిషనర్ అదనపు బాధ్యతలతో అనుకున్న స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, ఇప్పటికే ఇసుజు వాహనాల టెండర్ల వ్యవహారంలో ఈ విభాగం ఓ అధికారి అరోపణలు ఎదుర్కొంటుండడం వెరసి ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఒక్కో రీతిలో అక్రమాలకు అస్కారం ఏర్పడుతున్నది.. చక్రం తిప్పుతున్న ఫోర్‌మెన్ జీహెచ్ఎంసీలోని ఇతర విభాగాల్లో బదిలీలు కాస్త ఆలస్యమైనా తప్పకుండా జరుగుతున్నప్పటికీ, ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఇప్పటి వరకు బదిలీలే లేకపోవడం గమనార్హం.
కవాడిగూడలోని ఓ ఫోర్ మెన్ సుమారు 20 ఏండ్ల నుంచి అకడే కొనసాగుతూ, గతంలో స్పేర్ పార్ట్స్ సీమ్ వెలుగులోకి వచ్చినప్పుడు తన కింది స్థాయి ఉద్యోగిని బలి చేసి, తాము తప్పించుకుని, కొద్ది రోజుల క్రితమే పాలక మండలిలో కీలకమైన వ్యక్తిని మేనేజ్ చేసుకుని మళ్లీ కవాడిగూడ ఫోర్ మెన్ పోస్టింగ్‌ను దకించుకుని హవా చెలాయిస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. పాలకమండలిలో ఓ కీలక వ్యక్తిని మేనేజ్ చేసుకుని, లక్షలాది రూపాయలు అమ్యామ్యాలుగా సమర్పించుకుని కవాడిగూడలో ఫోర్ మెన్ సీటు దకించుకోవటం చర్చనీయాంశంగా మారింది.
ట్రాన్స్ పోర్టు విభాగం హెడ్ ఆఫీసులో మే 16, 1992లో ఫోర్ మెన్‌గా విధుల్లో చేరిన ఓ ఉద్యోగి వచ్చే 2033 ఫిబ్రవరి 28న రిటైర్డు కావాల్సి ఉంది. కానీ ఆయన విధుల్లో చేరిన మే 16, 1992 నుంచి ఎలాంటి బదిలీలు గానీ, పదోన్నతులు గానీ లేకుండా ఒకే సీటులో కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
అదే శానిటేషన్ విభాగంలో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న శానిటరీ జవాన్లను కొన్ని నెలల క్రితం అప్పటి కమిషనర్ ఇలంబర్తి బదిలీలు చేసి, సంచలనం సృష్టించినా, ఆయన ట్రాన్స్ పోర్టు విభాగంలోని లాంగ్ స్టాండింగ్‌లపై దృష్టి సారించలేకపోయారు. ఆయన దృష్టి సారించే సమయానికి బదిలీ అయినట్లు టాక్ లేకపోలేదు. ప్రస్తుతం ప్రతి మూడు నుంచి అయిదేండ్లలో అన్ని విభాగాల్లోని అధికారులు, సిబ్బందికి బదిలీ అవుతుంటే, ఆ బదిలీలు ట్రాన్స్ పోర్టు విభాగానికి ఎందుకు వర్తించదని ఇతర విభాగాల ఉద్యోగులు, ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు..
విధి నిర్వహణలో మాత్రమే వినియోగించాల్సిన వాహనాలను గ్రేటర్‌ను దాటించి ఇతర జిల్లాల్లోకి తమ సొంత అవసరాలకు కొందరు అధికారులు వినియోగిస్తున్నారు. ఇందుకు ట్రాఫిక్ చలాన్లు ఆవుననే సమాధానం ఇస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండాల్సిన వాహనాలు ఔటర్ దాటి ఇతర జిల్లాల్లో సైతం దర్శనమిస్తున్నాయి. సెలవు రోజుల్లోనే కాదు పని దినాల్లోనూ బయటి జిల్లాల్లో ఈ కార్లకు ఓవర్ స్పీడింగ్ , రాంగ్ పార్కింగ్, సిగ్నల్స్ జంపింగ్ వంటి ఛలాన్లు వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
వాస్తవంగా జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారులకు ఇన్నోవా కార్లు…డిప్యూటీ కమిషనర్లకు స్కార్పియో కార్లు, మెడికల్ ఆఫీసర్లు, జాయింట్ కమిషనర్లకు బొలెరో కార్లు ఉన్నాయి. వీటికి ఆయా విభాగాల అధికారులను బట్టి 200 నుంచి 280 లీటర్ల డీజిల్ ప్రతి నెల సమకూరుస్తుంది. ఇందులో చాలా మంది ఇంటికి ఆఫీసుకు మాత్రమే కార్లను ఉపయోగిస్తున్నారు. అందుకు ప్రతి రోజూ 30 నుంచి 50 కిలోమీటర్లు లోపు మాత్రమే తిరుగుతారు. కానీ 100 కిలోమీటర్ల దూరం తిరిగినట్లుగా డీజిల్ డ్రా చేసుకుంటున్నారు. కొందరు రెండు రోజుల్లో 35 లీటర్ల డీజిల్ డ్రా చేస్తున్నారు.
అయితే తిరిగి కిలోమీటర్లను బట్టి కాకుండా ప్రతి నెల వీరికి 280 లీటర్ల డీజిల్ ఇస్తుండడంతో అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతున్నది. ప్రతి వెహికల్లో ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అన్న డీటెయిల్స్ సేకరించి అందుకు తగ్గట్టుగా డీజిల్ సమకూర్చవచ్చు. కానీ కొందరు అధికారుల చర్యల కారణంగా సైంటిఫిక్‌గా కాకుండా ఇష్టారీతిలో డీజిల్ కూపన్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు స్వంత పనులు, టూర్లను వినియోగించుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జీహెచ్ఎంసీలో వాహనాన్ని అద్దెకు నడపాలంటే మోటారు వెహికల్ యాక్టు ప్రకారం సదరు వాహనం ఎల్లో ప్లేటు కలిగి ఉండాలి. కానీ జీహెచ్ఎంసీలోని పలు విభాగాల్లోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఆ పై హోదాలో విధులు నిర్వహిస్తున్న కొందరు ఆఫీసర్లు తమ సొంత వాహనాలను వినియోగిస్తూ, నెలాదాటగానే బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. మరి కొందరు అధికారులకు తమకున్న టూ వీలర్ వాహనాలపై రాకపోకలు సాగిస్తూ తాము కారు వినియోగిస్తున్నట్లు టూ వీలర్ నెంబర్ ప్లేటుతో ట్రాన్స్ పోర్టు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ప్రస్తుత కమిషనర్ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించి, ట్రాన్స్ పోర్టు విభాగంలో కొనసాగుతున్న లాంగ్ స్టాండింగ్‌లు, అక్రమాలు, అవకతవకలకు బ్రేక్ వేయాలని జీహెచ్ఎంసీ ఉద్యోగులు కోరుతున్నారు.
కమిషనర్ నుంచి అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషన్ల వరకు ఇన్నోవా వాహనాలను వినియోగిస్తుండగా.. డిప్యూటీ కమిషనర్లు, కొందరు ఇంజనీర్లకు బొలొరో వాహనాన్ని వాడుతున్నారు.. ఐతే బొలొరో వాహనాలు చాలా వరకు 15 ఏండ్లకు పైబడినే ఉన్నాయి.. వీటిని స్క్రాప్‌నకు పంపించి కొత్త వాహనాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది..కానీ ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా సంస్థ ఖజానాకు నష్టం వాటిల్లుతున్నది. ఈ టిప్పర్ల వినియోగంలో డీజిల్ దోపిడీ ఒక్కటే కాదు..చాలా వరకు మరమ్మతుల పేరిట కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాత టైర్లు వేసి కొత్త టైర్లు వేసినట్లు బిల్లులు పెట్టడం.. రిపేర్లలో వినియోగించే సామాన్లు సైతం అధిక మొత్తంలో బిల్లులు పెట్టి ఖజానాను గండి కొట్టడం వంటి ఘటనలు లేకపోలేదు.