సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ ) : నిరుపేదలు గర్వించే స్థాయిలో వేడుకలు నిర్వహించుకునేలా ఆధునిక హంగులతో మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్స్‌ను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకేసారి రెండు వేల మందితో వేడుక నిర్వహించేలా సకల సౌకర్యాలతో నిర్మించారు. ఈ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్స్‌లో సమర్థవంతమైన నిర్వహణ చేపడుతున్న జీహెచ్ఎంసీ.. తాజాగా వేడుకలు నిర్వహించుకునే వారికి మరింత ఉపశమనం కల్పిస్తూ అద్దె ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. స్థానిక ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు భారమైన అద్దె ధరలను సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఫంక్షన్‌హాళ్ల అద్దెలు, నిర్వహణ చార్జీల స్థిరీకరణకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇది వరకు మార్కెట్ విలువ ప్రకారం 10 శాతం చార్జీలు తీసుకునేవారు. ఇతర నిర్వహణ చార్జీలు వీటికి అదనం. ఇక నుంచి మాత్రం మూడు స్లాబులుగా విభజించి రేట్లను ఫిక్స్ చేశారు.
ఈ నేపథ్యంలోనే గతంలో సరాసరిగా ఒక ఫంక్షన్‌కు రూ.40వేలు ఖర్చు అవుతుండగా, తాజాగా కేటగిరీలు విభజించి అద్దెల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలోనే ఈ నూతన చార్జీలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా రూ. 90 కోట్లతో 31 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లును నిర్మించాలని భావించి ఇప్పటి వరకు రూ. 30.10కోట్లతో తొమ్మిది చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ. 65.60కోట్ల అంచనాతో మరో 16 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. అందుబాటులోకి వచ్చిన బహుళ వినియోగ ఫంక్షన్‌హాళ్లు వందలాది మందికి ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది.
జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో..
జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో ఈ ఫంక్షన్‌హాల్స్ నిర్వహణ జరుగుతుంది. చైర్మన్‌గా జోనల్ కమిషనర్, వైస్ చైర్మన్‌గా డిప్యూటీ కమిషనర్ (సర్కిల్), మెంబర్లుగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఇంజినీరింగ్ వింగ్), డీఈ (ఎస్డబ్ల్యూఎం/ఏఎంవోహెచ్), మెంబర్ కన్వీనర్‌గా అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్‌గా బాధ్యతలు వహించనున్నారు.
సమయాలు..