e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home హైదరాబాద్‌ ముహూర్తం ఖరారు..

ముహూర్తం ఖరారు..

ముహూర్తం ఖరారు..
  • బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి
  • జూలై 4 న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

బాలానగర్‌, జూన్‌ 19: ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు బాలానగర్‌లో నిర్మించిన ఫ్లైఓవర్‌ను జూలై 4న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారని.. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం బాలానగర్‌, ఫతేనగర్‌ కార్పొరేటర్లు ఆవుల రవీందర్‌రెడ్డి, పండాల సతీశ్‌గౌడ్‌, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఫ్లైఓవర్‌ పనులను పరిశీలించారు. జూలై 4 వరకు ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించామన్నారు. పనులు పూర్తి చేసేందుకు అవసరమైతే రాత్రి, పగలు పని చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలానగర్‌ ట్రాఫిక్‌ సమస్య ఫ్లైఓవర్‌తో తీరిపోవడం ఖాయమన్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో రూ.1000 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ పనులు ఇదివరకే చేపట్టినట్లు తెలిపారు. ఫతేనగర్‌ నుంచి సనత్‌నగర్‌ వెళ్లేందుకు త్వరలో అండర్‌పాస్‌ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. బాలానగర్‌, ఫతేనగర్‌ డివిజన్ల ప్రజలు కలుషిత నీటితో పడుతున్న ఇబ్బందులు గుర్తించిన సీఎం కేసీఆర్‌ పెద్దమనసుతో ఎస్టీపీ నిర్మాణం కోసం రూ.300 కోట్లు కేటాయించారని తెలిపారు. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఓల్డ్‌ బోయిన్‌పల్లి కార్పొరేటర్‌ ముద్దం నర్సింహ యాదవ్‌, బాలానగర్‌ మాజీ కార్పొరేటర్‌ కాండూరి నరేంద్రాచార్య, హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ యూసుఫ్‌ హుస్సేన్‌, ఈఈ రజిత, డీఈ హరికృష్ణ, ఏఈ అశుతోష్‌ వర్మ, ైప్లెఓవర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, మూసాపేట డీసీ రవికుమార్‌, కూకట్‌పల్లి డీసీ వి.ప్రశాంతి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు మందడి సుధాకర్‌రెడ్డి, ఎడ్ల మోహన్‌రెడ్డి, పంజా రాంచందర్‌ ముదిరాజ్‌, కంచి భిక్షపతి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముహూర్తం ఖరారు..
ముహూర్తం ఖరారు..
ముహూర్తం ఖరారు..

ట్రెండింగ్‌

Advertisement