పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంగా పలు షరతులను విధించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ) ః మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంగా పలు షరతులను విధించింది. రూ. 25 వేల విలువైన వ్యక్తిగత బాండ్ సమర్పించాలి. అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలి. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు లేదా 8 వారాలపాటు ప్రతి బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంబంధిత ఎస్ హెచ్ ఓ ఎదుట హాజరుకావాలి.
పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి. పోలీసులు కోరినప్పుడు హాజరుకావాలి. కింది కోర్టులో పాస్ పోర్టును స్వాధీనం చేయాలి. కింది కోర్టు అనుమతి లేకుండా కోర్టు పరిధిని దాటి వెళ్లరాదు. సాక్షులను ప్రభావితం చేయరాదు. ప్రలోభాలకు గురిచేయకూడదు. కేసు విచారణలో జోక్యం చేసుకోరాదు అంటూ షరతులు విధించింది. మొయినాబాద్‌లో తనపై అన్యాయంగా డ్రగ్స్ కేసు నమోదు చేశారని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రోహిత్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ కె. సుజన మంగళవారం విచారించారు.
రోహిత్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది డీఎస్ అనిరుద్ రెడ్డి వాదిస్తూ, కేసు విచారణ పూర్తయిందని, మార్చి 15 నుంచి జైలులోనే ఉన్నారని చెప్పారు. దీనిపై పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వరరావు ప్రతివాదన చేస్తూ, బెయిల్ మంజూరు చేస్తే షరతులు విధించాలని కోరారు. తీవ్ర అభియోగాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. వాదనలపై స్పందించిన హైకోర్టు, పిటిషనర్ రోహిత్ రెడ్డిని పోలీసులు నాలుగుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారని, కొకైన్ కేవలం 0.26 గ్రాములు మాత్రమే ఉందని, పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు ఆధారాలు లేవని, ఈ నేపథ్యంలో షరతులతో బెయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

