శేరిలింగంపల్లి: సర్వేజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’ యాప్ను బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం గచ్చిబౌలి పీనిక్స్ ల్యాబ్ కాన్ఫరెన్స్ హాల్లో నర్వేజన ఫౌండేషన్ చైర్వర్సన్, కిమ్స్ నన్పైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఏవీ గురవారెడ్డితో కలిసి ప్రారంభించారు. కాగా, యమ ధర్మరాజు వేషధారణలో వాహనదారులకు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. ఒక మోకాలు అరిగిపోతే కొత్త మోకాలు వేయగలం, కానీ తల పోతే ఇంకో తల రాదు… అని పేర్కొంటూ..హెల్మెట్ ధరించని వారికి హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వాహనదారులు సీటు బెల్టు పెట్టుకోవాలని అవగాహన కల్పించారు.