హైదరాబాద్: నగరంలో బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్షిణి అనే విద్యార్థిని కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఈ నెల 7న మిడ్ ఎగ్జామ్ ఉండటంతో ఆమె సమీప బంధువు మోహన్‌రెడ్డి యువతిని కాలేజీకి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే తాను ఐడీ కార్డు, మొబైల్ ఫోను ఇంట్లో మర్చిపోయానని చెప్పి క్యాంపస్ నుంచి బయటకు వచ్చింది.
అయితే సాయంత్రం అయినప్పటికీ ఆమె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వర్షిణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ముంబై కేంద్రంగా వినియోగించినట్టు గర్తించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. ఆమెకోసం గాలిస్తున్నారు.