సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ ) : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంకు ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోమవారం దుర్గం చెరువు, గోల్కొండ ఫోర్ట్‌లో ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్’ పేరిట పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించారు.
ఈ డ్రైవ్‌లో 600 మంది వాలంటీర్లు పాల్గొని పర్యాటక ప్రాంతాలైన దుర్గంచెరువు, గోల్కొండ ఫోర్ట్‌లో 1310 కేజీల వ్యర్థాలను సేకరించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై స్థానికులకు వలంటీర్లు అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆర్నికా దీక్షిత్ నిర్వాహకులను అభినందించారు.