Antimicrobial | సిటీ బ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సహజమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని మన్నా బయోటెక్ సంస్థ ఎండీ డాక్టర్ చత్యుష్య అన్నారు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా యాంటీ బయోటిక్స్ వాడటం మంచిది కాదని, నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చత్యుష్య మాట్లాడుతూ.. పోషక, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆహారాన్ని ఔషధంగా మలచుకోవాలని పేర్కొన్నారు. సంస్థలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు, గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొని యాంటీ బయోటిక్స్ అనవసరంగా వాడడాన్ని తగ్గించాలని నినాదాలు చేశారు. వాటి వల్ల కలిగే దష్ప్రభావాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చిన్న నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ రూపస్ కుమార్, అకడమిక్ డైరెక్టర్ మునికుమార్, పరిశోధకులు మానస, వినీల, ప్రోగ్రాం మేనేజర్ భరత్‌కుమార్ పాల్గొన్నారు.