సోమవారం 08 మార్చి 2021
Hyderabad - Dec 03, 2020 , 08:17:31

క్యాన్సర్‌ దవాఖానకు అవార్డు అందజేత

క్యాన్సర్‌ దవాఖానకు అవార్డు అందజేత

శ్రీనగర్‌కాలనీ : కొవిడ్‌ పరిస్థితుల్లో అందించిన ప్రత్యేక సేవలకు గుర్తింపుగా బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ దవాఖానకు కొవిడ్‌ వారియర్‌ అవార్డును అందజేశారు. బుధవారం ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి పఘన్‌సింగ్‌ కులస్థే ప్రకటించారు. క్యాన్సర్‌ దవాఖానతో పాటు ప్రత్యేక సేవలు  అందించిన డాక్టర్‌ ఆర్‌వీ ప్రభాకర్‌రావుకు కొవిడ్‌ వారియర్‌ అవార్డును ప్రకటించింది. అదే విధంగా  వరల్డ్‌ హెల్త్‌, వెలెనెస్‌ కాంగ్రెస్‌ అందజేసే  తెలంగాణ హెల్త్‌ కేర్‌ లీడర్‌ షిప్‌ అవార్డుకు ప్రభాకర్‌రావు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ దవాఖాన చైర్మన్‌ నందమూరి బాలకృష్ణను సంస్థ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  


VIDEOS

logo