షాబాద్, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీ అవిర్బావ దినోత్సవం సందర్భంగా షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి పార్టీకి తనవంతుగా రూ.10లక్షల విరాళం అందజేశారు. సోమవారం నగరంలోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు అవినాశ్‌రెడ్డి రూ.10లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…. బీఆర్ఎస్ పార్టీకి తనవంతుగా విరాళం అందజేసిన అవినాశ్‌రెడ్డిని అభినందించారు.
గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కూడా అవినాశ్‌రెడ్డి తనవంతుగా రూ.25లక్షల ఆర్థిక సాయం అందజేశారని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న అవినాశ్‌కి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మండల ప్రతిపక్షనేత మధుసూదనాచారి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.