మూసాపేట, ఏప్రిల్ 29: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఓ ఆటో ట్రాలీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లను, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆటో ట్రాలీ కేపీహెచ్బీ నుంచి కూకట్పల్లికి వెళ్తుంది. మార్గమధ్యలో పుల్లారెడ్డి స్వీట్స్ వద్ద అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లను, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ముగ్గురు వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వాహనదారులు ఆటో ట్రాలీ డ్రైవర్ను చితకబాదారు. ఆటో ట్రాలీ డ్రైవింగ్ చేస్తున్న హమ్మద్ మద్యం మత్తులో నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రాలీ డ్రైవర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్ట్ చేయగా 70 శాతం వచ్చింది. వెంటనే పోలీసులు హమ్మద్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.