ఆటో డ్రైవర్ల ఆగ్రహం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయకపోతే రాష్ర్టాన్ని స్తంభింపజేస్తామని రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హామీల అమలు కోసం ఈనెల 24 నుంచి ఆటో డ్రైవర్ల నిరవధిక సమ్మె(బంద్) నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- 24 నుంచి నిరవధిక సమ్మె
చిక్కడపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయకపోతే రాష్ర్టాన్ని స్తంభింపజేస్తామని రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హామీల అమలు కోసం ఈనెల 24 నుంచి ఆటో డ్రైవర్ల నిరవధిక సమ్మె(బంద్) నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆటో, యాస్, ఆధారిత డ్రైవర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆటో, క్యాబ్, వ్యాన్, డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహించారు.

వి.మారయ్య(బీఆర్టీయూ), సత్తిరెడ్డి, గాజుల ముఖేష్ గౌడ్, పి.శ్రీకాంత్, విశంకర్(బీఎంఎస్), వి.ప్రవీణ్(టీయూసీఐ) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరవధిక సమ్మె(బంద్)కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ, కార్పొరేట్ సంస్థలకు ఈవీ ఆటోలు అందించే ప్రతిపాదననను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని, నగరంలో సుమారు 2.5 లక్షల మంది ఉన్నట్లు చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరుకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు వి. మల్లేష్ గౌడ్, యాదగిరి దయానంద్, కొమరయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

