ఆటోడ్రైవర్ల మహాధర్నా
ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మంగళవారం మహాధర్నా నిర్వహించారు.
కవాడిగూడ, మే 5: ఎన్నికల సందర్భంగా ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మంగళవారం మహాధర్నా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన రవిశంకర్ అల్లూరి, పెంటయ్యగౌడ్ మాట్లాడుతూ ఆటో ప్రైవేట్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. లేనట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలను విస్మర్మించడం దారుణమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో ఆటోడ్రైవర్ల ఉపాధి దెబ్బతిని ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక కుటుంబాలను పోషించడం భారంగా మారి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
సొంత ఇళ్లు లేని డ్రైవర్లకు డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల నందకిశోర్, టీఎస్పీటీ టీఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు లికిత్‌కుమార్, ఉపాధ్యక్షులు హబీబ్, క్యాబ్ యూనియన్ నాయకులు మీనా, సంతోష్, అశ్విన్‌రాజ్, శ్రీనివాస్‌ముదిరాజ్, మహేశ్, జహంగీర్, సంతోష్, వెంకటేశ్, రాములు, రమేశ్, వజ్రలింగం, మహేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

