సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): వివిధ కారణాలతో పోలీసులు స్వాధీనం చేసుకున్న, గుర్తుతెలియని వ్యక్తులు రోడ్లపై వదిలేసిన 1212 వాహనాలను ఇంతవరకు ఎవరూ క్లెయిమ్ చేయలేదని, వాటిని అండర్ సెక్షన్ 7 హైదరాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ యాక్ట్ 2004, రెడ్ విత్ 40 హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం వేలం వేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.
ఈ వాహనాలలో ఏదైనా అభ్యంతరమున్నా, యాజమాన్య, హైపోథికేషన్ హక్కులకు సంబంధించిన డాక్యుమెంట్లతో ఈ ప్రకటన వెలువడిన ఆరు నెలల్లోపు బంజారాహిల్స్‌లోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో దరఖాస్తు చేసి, తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవచ్చని సూచించారు. ఆరు నెలల్లో ఎవరూ క్లెయిమ్ చేయకపోతే.. ఆయా వాహనాలను వేలం వేస్తామన్నారు. ఈ వాహనాల వివరాలు గోషామహల్‌లోని శివకుమార్ లాల్ పోలీస్ స్టేడియం ఆఫీస్‌లో, హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక వెబ్సైట్(www.hyderabadpolice.gov.in) లోనూ అందుబాటులో ఉంటాయని సీపీ సూచించారు.