చార్మినార్, జనవరి 29: అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు జరుగుతున్నాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొపారు. శనివారం చార్మినార్ నియోజకవర్గం మొఘల్‌పుర డివిజన్ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, యువకులు, ఇతర పార్టీలకు చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హోం మంత్రి మహమూద్ అలీ పార్టీ కండువాలను కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ల వారీగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోపీనాథ్‌యాదవ్, మణికొండ విజయ్‌కుమార్, శ్యాంసింగ్, రజనీకులకర్ణి, అరుణ, త్రివేణి, అనిత, శశికళ, రాజేశ్వరి, తదతరులు పాల్గొన్నారు.