కవాడిగూడ, జనవరి 2: సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం కవాడిగూడకు చెందిన బీజేపీ, బీఎస్పీ నాయకులు సిరిపల్లి శంకర్, నరేశ్‌తో పాటు డివిజన్లోని కోదండరెడ్డి బస్తీవాసులు దాదాపు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.
రాష్ట్రంతో పాటు దేశంలో పెను మార్పులు తీసుకురావడానికే బీఆర్ఎస్ని తీసుకువచ్చారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్‌కుమార్, ఆర్.రాజేశ్, శ్రీహరి, మధు, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్, దీన్ దయాల్రెడ్డి, రవి, నరేశ్, లవకుమార్, విఠల్, మధు, లక్ష్మి, ఉప్పలయ్య, రవీందర్ పాల్గొన్నారు.