హైదరాబాద్ : నగర పరిధిలోని రాజేంద్రనగర్‌లో మహిళ కిడ్నాప్ కలకలం సృష్టించింది. చింతల్ మెట్ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తి దివ్యాంగురాలిని కిడ్నాప్‌కు బలవంతంగా ఆటోలో ఎక్కించి, ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు. సదరు మహిళ తనను కాపాడాలని కేకలు వేసింది. స్థానికులు మహిళ అరుపులు విని ఇండ్లల్లో నుంచి బయటకు వచ్చారు.
దాంతో సదరు వ్యక్తి మహిళను రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. బాధితురాలిని 108 ద్వారా ఆసుప్రతికి తరలించారు. చింతల్మెట్ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే, మహిళ ఎవరు..? కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి అనే కోణంలో పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. సదరు మహిళను గచ్చిబౌలీ ప్రాంతానికి చెందిన మహాలక్ష్మిగా గుర్తించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.