హైదరాబాద్ : నగరంలోని చంద్రాణగుట్ట(Chandrayangutta) బర్కాస్ ప్రాంతంలో గల శ్రీ ద్విముఖి హనుమాన్ మందిరంపై( Dwimukhi Hanuman temple) గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమెదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోషులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.