బేగంపేట: ట్రాఫిక్కు అవంతరాలు కలిగిస్తున్న వారిని అక్కడి నుంచి వాహనం తొలగించాలని కోరిన ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్పై కొంత మంది కార్మికులు దౌర్జన్యానికి దిగారు. రాష్ట్రపతి రోడ్డులోని కేఎల్ఎం మాల్ పక్కన ఓ భవనంలో మాల్ మరమ్మతులు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి సామగ్రిని తీసుకువచ్చిన ఓ ఆటో రోడ్డుపైన నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ అవాంతరం ఏర్పడింది.
మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ వాహనాన్ని తొలగించాలని అక్కడే ఉన్న సిబ్బందికి సూచించారు. అక్కడే గ్లాస్ ఫిట్టింగ్ చేసే కార్మికులకు ఇన్స్పెక్టర్కు మధ్య వాగ్వివాదం జరిగింది. కార్మికులు ఇన్స్పెక్టర్ను తొసేసి దౌర్జన్యానికి దిగడంతో పాటు ఆయన విధులకు ఆటంకం కలిగించారు. వెంటనే ఇన్స్పెక్టర్ రఘునాథ్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.