బంజారాహిల్స్, ఆగస్టు 15: భార్య, కూతురిపై దాడికి పాల్పడటంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని సింగాడకుంటలో మహ్మద్ యూసుఫ్ నివాసముంటున్నాడు. ఇంటికి సంబంధించిన అద్దెలు మొత్తం వసూలు చేసుకోవడంతో పాటు జల్సాలకు ఖర్చు చేస్తుంటాడని, ఇంట్లో పెండ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లలను పట్టించుకోవడం లేదని తరచూ భార్య అతడితో గొడవ పడుతుండేది. ఈ నేపథ్యంలో శనివారం ఇంటికి వచ్చిన తండ్రి యూసుఫ్ తన తల్లితో పాటు సోదరిపై విచక్షణారహితంగా దాడి చేశాడని, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ పెద్ద కూతురు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు యూసుఫ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అదుపులోకి తీసుకున్నారు.