సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది మరాఠీలు ఉన్నారని, రాజకీయాలలో ప్రాతినిధ్యం వహించేందుకు మరాఠీలకు సీట్లు కేటాయించాలని తెలంగాణ భవసర్ క్షత్రీయ రంగ్రేజ్ సమాజ్ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఆదివారం రాంకోఠిలోని షాలీమార్ ఫంక్షన్ హాల్లో సమాజ్ ఆధ్వర్యంలో వధూవర్ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిలీప్ ఘనాతే, సమాజ్ తెలంగాణ అధ్యక్షుడు ఉమేశ్ జైఠ్నీ, జంటనగరాల అధ్యక్షుడు డి.మోహన్‌రావు మాట్లాడుతూ.. మరాఠీ మాట్లాడే 30 లక్షల మంది అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కోకాపేటలో అర ఎకరం స్థలంతో పాటు ఆత్మగౌరవ భవనం నిర్మించుకునేందుకు రూ. 50 లక్షలు కేటాయించడం హర్షణీయమన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో 32 వేల మంది మరాఠీలు ఉన్నారని, భవసర్ క్షత్రీయ రంగ్రేజ్ సమాజ్‌కు చెందిన వారు రాజకీయంగా ఎదిగేందుకు ఎమ్మెల్యే సీటును కేటాయించాలని కోరారు.
గోషామహల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు దిలీప్ ఘనాతేకు టికెట్‌ను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాజ్ ప్రతినిధి చావన్, సమాజ్ కోశాధికారి అశ్విన్‌కుమార్ పతంగే, ప్రధాన కార్యదర్శి రాజేశ్ జవాల్కర్, జంటనగరాల సమాజ్ ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, మల్కాజిగిరి అధ్యక్షుడు రవి మహేందర్ కార్, తెలంగాణ సమాజ్ యువజన అధ్యక్షుడు బాలచందర్ అచల్కర్, సలహా దారులు శివ కుమార్ మహేంద్ర కార్, డాక్టర్ గోపాల్‌రావు బగ్గాడే, రమేశ్ గానోర్, డాక్టర్ అరుణ బాంగ్రే, వసంత బాగ్డే, సీనియర్ ఉపాధ్యక్షులు గోపాల్ పోటే, విజయ తాండ్లే, జగన్ మోహన రావు పతంగే, ఉపాధ్యక్షులు విజయలక్ష్మి సుత్రావే, బాల హనుమంత్ రావు హంచాటే, మహిళా పరిషత్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయ హరినాథ్ సుత్రావే, గ్రాడ్యుయేట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ మైస్కర్, కార్యవర్గ సభ్యులు అమర్నాథ్ వాత్రే, లక్ష్మీనారాయణ్ మలాట్కర్, గిరీశ్ సులాకే, దయానంద్ పతంగే, సికింద్రాబాద్ యూనిట్ అధ్యక్షుడు వెంకట్రావు మహేంద్రకార్ తదితరులు పాల్గొన్నారు.