హైదరాబాద్‌లో భారీ చోరీ.. రూ. 36 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్
హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలోని దుండిగల్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. ఏటీఏం కేంద్రాలకు డబ్బును తరలించే వాహన డ్రైవర్ రూ. 36 లక్షల నగదుతో పరారీ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బేగంపేటకు చెందిన రైటర్స్ సంస్థ సిబ్బంది హైదరాబాద్‌తో పాటు శివార్లలోని పలు ఏటీఏం కేంద్రాల్లో నగదు జమ చేస్తుంటారు. అయితే ఈ సంస్థలో 20 రోజుల క్రితమే సాగర్(25) అనే వ్యక్తి డ్రైవర్‌గా చేరారు.
శనివారం మధ్యాహ్నం టీఎన్09 సీవై 3354 నంబర్ గల వాహనంలో రూ. 64 లక్షల నగదుతో కస్టోడియన్లు నితిన్, రంజిత్, గన్‌మెన్ బాబు, డ్రైవర్ సాగర్ కలిసి రైటర్స్ సంస్థ నుంచి బయల్దేరారు. జీడిమెట్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ. 13 లక్షల జమ చేశారు. అక్కడ్నుంచి నేరుగా దుండిగల్ సాయిబాబా నగర్‌లోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్దకు సరిగ్గా మధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకున్నారు. వాహనంలో నుంచి రూ. 15 లక్షలు తీసుకొని ఏటీఎం వద్దకు వెళ్లారు.
డ్రైవర్ సాగర్ మాత్రం వాహనంలో ఉండిపోయాడు. యూ టర్న్ తీసుకుని వస్తానని గన్‌మెన్‌కు చెప్పి వెళ్లిపోయాడు. ఎంతసేపటికి సాగర్ తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి కస్టోడియన్లు, గన్ మెన్ కలిసి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 36 లక్షల నగదుతో డ్రైవర్ సాగర్ పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాగర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నర్సాపూర్ రోడ్డులో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదు ఉన్న బ్యాగుతో సాగర్ పరారీ అయ్యాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

