గోల్నాక, సెప్టెంబర్ 4 : గత 15 రోజుల క్రితం అంబర్‌పేట నారాయణ కాలేజీలో తన స్నేహితుడికి టీసీ ఇవ్వలేదంటూ మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి సంఘం నాయకుడు సందీప్ పెట్రోలు పోసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన ఘటన తెలిసిందే.
ఈ ఘటనలో అతడిని అడ్డుకునే క్రమంలో కాలేజీ ఏవో అశోక్‌రెడ్డికి తీవ్రగాయాలు కాగా కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో ఆపోలో దవఖానాలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. సందీప్ పరిస్థితి కూడా ఇంకా విషయంగా ఉన్నట్లు తెలిసింది.