వెంగళరావునగర్, అక్టోబర్ 26 :వృద్ధురాలి మెడలో నుంచి మంగళసూత్రం అపహరించిన నిందితుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎస్ఆర్నగర్ ఏసీపీ వెంకటరమణ వివరాలు వెల్లిడించారు. బోరబండ, హబీబ్ ఫాతిమానగర్‌కు చెందిన గుడిమెట్ల గోపీనాథ్(25) ఓ కంపెనీలో పనిచేసి ఇటీవల మానేశాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీ చేయాలనే పథకం వేశాడు. శుక్రవారం సాయం త్రం జెక్కాలనీలో సాయంత్రం నడకకు వచ్చిన అలమూరి కృష్ణకుమారి(64) మెడలో నుంచి 3తులాల బంగారు మంగళ సూత్రాన్ని తెంచుకొని ద్విచక్ర వాహనం పై పారిపోయాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జంగ య్య నేతృత్వంలో నిందితుడి జాడ కోసం జల్లెడ పట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అమీర్‌పేట గురుద్వార సమీపంలో అరెస్టు చేసి, బంగారు మంగళసూత్రాన్ని ,చోరీకి ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజు వ్యవధిలోనే గొలుసు దొంగను పట్టుకున్న ఎస్ఆర్నగర్ క్రైం, టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏసీపీ అభినందించారు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డీఐ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.