హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ప్రముఖ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు అలం ఖాన్ అతని కుమారిడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మాసబ్ ట్యాంక్ వద్ద ఈనెల 23న ఖాజామొయిజుద్దీన్ దుండగులు కారు గుద్ది హతమార్చారు.
భూవివాదాల్లో ఖాజామొయజుద్దీన్ అడ్డుగా మారుతున్నారనే కారణంతోనే ప్రత్యర్థులు అతనిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఇప్పటికే నలుగురు నిందితులను గోవా, కల్వకుర్తి ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రూ.15 లక్షల సుపారీ ఇచ్చి, కారు స్టంట్స్‌లో నిపుణుడైన అభిజిత్‌తో సహా ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు కుట్ర పన్నినట్లు దర్యా్రప్తులో తేలింది.