హైదరాబాద్ : ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బృందాల కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఏఆర్ పోలీసుల కోసం నూతనంగా నిర్మించిన క్యాంటీన్‌ను, వాలీబాల్, మహిళల బ్యాడ్మింటన్ కోర్టును సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఏఆర్ పోలీసులు విరామం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్కార్ట్, బందోబస్తు విధులతో పాటు వీఐపీ సమావేశాలకు ఏఆర్ పోలీసులు భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఏఆర్ పోలీసులు ముందు వరుసలో ఉండి సహాయక చర్యల్లో నిమగ్నమవుతారని చెప్పారు. పోలీసు సిబ్బంది ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం టాటా ఏరోస్పేస్ సహకారంతో బోట్లు సమకూరుస్తున్నామని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు.
@mahmoodalitrs @TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @ts_womensafety @TS_SheTeams @SwatiLakra_IPS @SumathiIPS @AddlCPCrimesHyd @CPHydCity @cpcybd @IPS_Association @TelanganaToday @THHyderabad @DeccanChronicle @eenadulivenews @thenewsminute @NewsMeter_In pic.twitter.com/aUM7FrsrOC
— Rachakonda Police (@RachakondaCop) June 24, 2021