మియాపూర్ , ఫిబ్రవరి 11 : ఎస్ఆర్ ఎస్టేట్స్ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలను తొలగించేందుకు మియాపూర్ ప్రధాన రహదారి, ఫ్రెండ్స్ కాలనీ, ఎస్ఆర్ ఎస్టేట్స్, ఎస్వీఎస్ ప్లాజా, టాకీ టౌన్ ప్రాంతాల్లో శనివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, ఏఎస్ రాజు ఫీడర్ పరిధిలోని ఆర్వీ నిర్మాణ్, నీలిమా గ్రీన్స్, రాధా మాదవ్ అపార్టుమెంట్, మేమదుర్గా అపార్టుమెంట్ ప్రాంతాల్లో 11.30 నుంచి రెండు గంటల వరకు, నీలిమ గ్రీన్స్ ఫీడర్ పరిధిలోని ప్రగతి ఎన్క్లేవ్, మీడియా కాలనీ, ఎఫ్‌సీఐ కాలనీ ప్రాంతాల్లో మూడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు మియాపూర్ ఏఈ రాజ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని ఏఈ కోరారు.
కొండాపూర్, ఫిబ్రవరి 11 : గౌతమీ సొసైటీ, కళాజ్యోతి ఫీడర్ల పరిధిలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు కొండాపూర్ ఏఈ రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొమ్మల తొలగింపు పనుల వల్ల ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గౌతమీ ఎన్క్లేవ్, కళాజ్యోతి లేన్, కుమ్ కుమ్ అపార్ట్మెంట్స్, ఆర్వీ నిర్మాణ్ లేన్ ప్రాంతాల్లో, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మసీద్ బండా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.