కాచిగూడ,జనవరి 22 : కేంద్ర ప్రభుత్వం అమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ(National Skill Academy) ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ శిక్షణ, సైబర్ సెక్యూరిటీ(Cybersecurity), బిగ్ డేటా కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ అడపా వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 100కు పైగా అంతర్జాతీయ సాప్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వన్నుట్లు పేర్కొన్నారు.
సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సులు, ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ విభాగం, డేటాసైన్స్, బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటర్, జావా, ఓరాకిల్ కోర్సుల్లో ఆన్లైన్లో 2-6 నెలల శిక్షణ ఇవ్వన్నుట్లు తెలిపారు. కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ చదివిన యువతి, యువకులు ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9505800050, www.nationalskillacademy.inలో సంప్రదించాలన్నారు.