OU | వివిధ పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ డిప్లొమా కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, పీజీ డిప్లొమా ఇన్ మ్యాథమెటిక్స్ తదితర కోర్సుల పరీక్షల ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు.
విద్యార్థులు తమ మార్కు మెమోలను దూరవిద్య కేంద్రం నుంచి పోస్టులో పొందుతారని చెప్పారు. ఈ రివాల్యుయేషన్ కు ఒక్కో పేపర్కు రూ.700 చొప్పున చెల్లించి ఈ నెల 17వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ300 అపరాధ రుసుముతో ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పరీక్ష జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్ కు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 17వ తేదీ వరకు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

