సిటీబ్యూరో, మార్చి 22 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ జిల్లా నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచితంగా( Free Training) రెసిడెన్షియల్తో కూడిన టీఆర్టీ(DSC) శిక్షణ ఇస్తామని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ కోసం డీఈడీ(టీటీసీ), బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై డీఎస్సీ-2024కు దరఖాస్తు చేసుకున్న హైదరాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3లక్షలకు మించకూడదని తెలిపారు. ఇతర కోర్సులు అభ్య సిస్తున్న వాళ్లు.. గతంలో ఉచిత శిక్షణ పొందిన వాళ్లు అనర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 25 లోపున tsstudycircle.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.