బంజారాహిల్స్, నవంబర్ 27 :ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాలపై యువ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్లకు అవగాహన కల్పించేందుకు ఆదివారం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు.
తెలంగాణ, ఏపీలతో పాటు పలు రాష్ర్టాలకు చెందిన 150మందికి పైగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లు వర్క్‌షాపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో అపోలో వైద్యులు డా.నవీన్ పోలవరపు, డా.శరత్, డా.కేఎస్.సోమశేఖర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.